22, అక్టోబర్ 2023, ఆదివారం

మేల్కొలుపు…

 

మేల్కొలుపు…


పూర్వం ఇద్దరు రాజులు రథాలపై ప్రయాణం చేస్తూ ఇరుకైన ఒక వంతెన మీద ఎదురయ్యారు.

ఒక రథం వెనక్కి వెళ్తేనే, మరో రథం ముందుకు వెళ్లగలదు.

రథసారధులిద్దరూ నీ రథం వెనక్కి తీసుకెళ్ళంటే... నీదే తీసుకెళ్ళమని వాదించుకోడం‌మొదలెట్టారు.

ఇద్దరు రాజులూ ఏం జరుగుతుందా అని చూస్తున్నారు...

చివరికీ ఇద్దరు సారధులూ ఒక ఒప్పందానికి వచ్చారు.


వాళ్ళు తమ రాజుల గొప్పదనం చెప్పేట్టు... ఏ రాజు గొప్పవాడో ఆరాజుకు రెండో రాజు ముందు దారి ఇచ్చేట్టు...!


మొదటి రధసారధి ఇలా అన్నాడు...

మా రాజ్యంలో మా రాజుగారు రోజుకి వందమంది అభాగ్యులకి, ఆకలి బాధతో ఉన్నవారికి భోజనం ఏర్పాటుచేసి గానీ వారు భుజించరు. కట్టుకోవడానికి గుడ్డలు కూడా లేని వారిని రోజుకి ఐదారువందలమందిని ఎంపిక చేసి వారికి వస్త్రదానం చేస్తారు. ఎన్నో అనాధ శరణాలయాలు, వృద్ధాశ్రమాలూ స్థాపించారు...!!


రెండవ సారధి తలదించుకుని, కంట నీరుపెట్టుకుని మారుమాట లేకుండా తన రథం వెనక్కి తీయడానికి సిద్ధమయ్యాడు!!


దానికి ఆరాజు గారిలా అడిగారు... ఏమయ్యా... మీ రాజుగారికి దాన గుణం‌లేదా?...

అలా ఏమీ చెప్పకుండా రథం వెనక్కి తిప్పుకుంటున్నావు.


దానికా... రెండో రథ సారధి, వినయంగా ఇలా అన్నాడు...


హే రాజా!.... మా రాజుగారు దానం చేస్తుండగా చూసే అదృష్టం మా రాజ్యం లో ఎవరికీ కలగలేదు; మా రాజ్యం లో దానం చేద్దామ‌ంటే సామాన్యులమైన మాకే ఒక్క దీనుడు కూడా కనిపించడు. ఇంక మారాజుగారికి దానం చేసే అవకాశం ఎలా దక్కుతుంది. వృద్ధాశ్రమాల్లో ఉండాల్సిన అవసరమూ ఏనాడూ ఎవరికీ కలగలేదు; ఇంక వృద్ధాశ్రమాలు నిర్మించే అవసరం ఏమి ఉంటుంది. దానం చేసే, వృద్ధాశ్రమాలు నిర్మించే అవసరం అవకాశం మా రాజ్యంలో లేదు ప్రభూ! అన్నాడు.


వెంటనే... మొదటి రథంలో రాజు, రథం దిగి... రెండవ రాజుకు పాదాభివందనం చేసి... తన రథం వెనక్కి తీయించి దారి ఇచ్చాడు...


వేల వృద్ధాశ్రమాలూ!... రాయితీలు!... సంక్షేమపథకాలూ!... ఉచితాలూ!... అభాగ్యులకు సేవలూ!... సమానత్వం కోసం రిజర్వేషన్లు!... దశాబ్దాలుగా అమలు చేసే పరిస్థితులున్న దేశము... ఆశించే పౌరులు... ఉన్నట్టి ఏ దేశమూ మంచి పాలనలో ఉన్నట్టు కాదు... అది సరైన పాలనా కాదు...


పాలకుల...పాలితుల... దౌర్భాగ్యానికి... చిహ్నం ఆ దేశం...!!


ఏ దేశంలో రాయితీల అవసరం ఉండదో... ఆ దేశం కంటే గొప్ప దేశం మరొకటి ఉండదు.


రాయతీలు హీన పరిస్థితికి అద్దాల వంటివి. కేజీ బియ్యం తక్కువ ధరకి యిచ్చే ప్రభుత్వం కంటే... ఎంత ధరకయినా కొనగలిగే ప్రజలుండే ప్రభుత్వం గొప్పది. ఈ విషయం ఎన్నో విధి విధానాలకు వర్తిసుంది...


ఇవన్నీ అవగాహన చేసుకుని... ఆలోచించి... ఉత్తమ రాజ్యంగా...

మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని... నిర్మించుకునేదెప్పుడు??!

మన ప్రజలు మేల్కొనేదెప్పుడు?!! భరత జాతి చైతన్యవంతమయ్యేది ఎప్పుడు?!!

🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔


మనం మారదాం - బంగారు భారత దేశాన్ని తిరిగి నిర్మిద్దాం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మేం రాజకీయ నాయకులం

కడుపు నిండుగా మాంసాహారం, గొంతు నిండుగా మద్యపానం, జేబు నిండుగా నల్లధనం, ఉచిత హామీలు ఎరగా పెట్టి గేలం వేస్తాం. చిక్కిన చేపల దన్నుగ చిక్కని చేప...