11, జులై 2022, సోమవారం

కాదు కాదు ఇది వృద్ధాప్యం ఎంత మాత్రం కాదు

 

కరిగిన కాలం సాక్షిగా
ఉడిగిన శరీరం
జవలేని కండలు
గుంతలడిన కండ్లు
ఎముకలు తేలిన ఒళ్ళు

ఏ పని చేయలేని దిగులు
ముందుకు పడని అడుగులు
చేయూతకై చేతులు
పలకరింపుకై  చెవులు
వణుకుతున్న కంఠాలు
తప్పనిసరైన చేదు మందులతో
రుచులు మరిచిన నాలుకలు
నిరాశ నిండిన మనస్సు
ఇదేనా వృద్ధాప్యం

కాదు కాదు ఇది ఎంత మాత్రం కాదు
ఊడింగింది శరీరం కాని ఉరకలు వేసే మనసు కాదు
జవచచ్చింది కండలుకు కాని ఉత్సాహానికి కాదు
గుంతలు పడ్డది కళ్లకు కాని అనుభవానికి కాదు
ఎముకలు తేలింది ఒంటికి కాని సునిశిత బుద్ధికి కాదు
నిరాశనిండిన మనసును ఉరకలెట్టించగల మిత్రులు లేకపోలేదు
ఏ పనిచేయలేనని దిగులెందుకు నీ జ్ఞానం పంచితే చాలదు
ముందుకు పడంది అడుగులు గాని మీ ఊహలు కాదు
చేయూత కోసం చూడటమెందుకు జాతిని చైతన్య పరిచే చేతలు మీవి
వణుకుతుంది కంఠమే కానీ మీ వ్యక్తిత్వం కాదు
పలకరింపుల కోసం చూడటమెందుకు పులకించే మనసుండగా
మనసు ఉత్సాహంగా ఉంటే మందు మాకుల పని లేదు
రుచులు మరిచిన నాలుక చవులూరింప సంగీత కచేరీ చేయండి
ఈ జన్మకు మరుజన్మకు కావల్సిన జ్ఞాన సంపద పెంచండి, పంచండి
 

--శివ భరద్వాజ్
భాగ్యనగరం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ శ్రమని దాచిపెట్టి పిల్లలను పెంచకండి.

 పరుల సొమ్ము ఎంత విలువైనదైనా అది మనది కాదు. మనది కానిది ఆశించటం మంచిది కాదు. మీ శ్రమని దాచిపెట్టి పిల్లలను పెంచకండి. మీరు ఎంత శ్రమించి పెంచు...