5, జూన్ 2022, ఆదివారం

తెలుసుకో మానవుడా - పర్యావరణం ప్రకృతి వరం

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 

తెలుసుకో మానవుడా - పర్యావరణం ప్రకృతి వరం 

పర్యావరణం ప్రకృతి వరం
తెలిసినా చేస్తున్నాం నాశనం
అలసత్వం ప్రధాన కారణం
నేనొక్కడిని మారితే మారుతుందా
అని ప్రతి ఒక్కరు తలో చేయేసి చేస్తున్నారీ దారుణం
కొండలు కరగనిదే ఇల్లు కట్టలేం
కాండాలు కోయనిదే పేపర్ చదవలేం
కారులు లేనిదే షికారు చేయలేం
ఏసీలు లేనిదే ఇంట ఉండలేం
ఇవి పర్యావరణానికి చేసే హాని ఊహించలేం
పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా స్థలం పెరగదు
మన ఆవాసం కోసం, అటవీ సంపద కోసం
అడవుల నాశనం చేసి పుడమి తల్లి
ఊపిరితిత్తులు చిదిమేస్తున్నాం
ఆ ఊపిరి ఆగితే మన ఊపిరి
ఆగుతుందని తెలియకుంటున్నాం
అవసరం లేనిదే భూముల స్థలాలు చేసి
విక్రయం చేసి ఫలించే భూమిని గొడ్రాలు చేస్తున్నాం
తెలుసుకో మానవుడా నీ స్వార్ధం కోసం
సర్వ జీవుల ఆవాసాన్ని బలిచేస్తున్నావు
ఆ జీవులలో నీవు ఒకడని తెలుసుకో

----శివ భరద్వాజ్
భాగ్యనగరం


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ శ్రమని దాచిపెట్టి పిల్లలను పెంచకండి.

 పరుల సొమ్ము ఎంత విలువైనదైనా అది మనది కాదు. మనది కానిది ఆశించటం మంచిది కాదు. మీ శ్రమని దాచిపెట్టి పిల్లలను పెంచకండి. మీరు ఎంత శ్రమించి పెంచు...