22, మే 2022, ఆదివారం

మళ్ళీ బాలలమైతే చాలు - మనందరి భవిత బంగారమే

మళ్ళీ బాలలమైతే చాలు - మనందరి భవిత బంగారమే


ఏ భాద్యత లేనిది ఏ బరువు మోయనిది
ఏ కల్మషం లేనిది ఏ మరక అంటనిది
కల్లాకపటం ఎరగనిది
చల్లమనసు కలిగినది
మతమౌమౌఢ్యము అంటనిది
కుల జాఢ్యము తెలియనిది
ఏ మరక అంటని తెల్లని వస్త్రమది
ఏ రాత రాయని తెల్ల కాగితమది
స్వచ్ఛంగా ఉంటుంది
స్వచ్ఛంగా నవ్వుతుంది
నవ్వుతూ పలకరిస్తుంది
సంతోషంతో చరిస్తుంది
సాటివానికి సాయం చేస్తుంది
అందరినీ సమదృష్టితో చూస్తుంది
పెద్దల్ని చూసి అనుకరిస్తుంది
పెద్దల్ని చూసి ఆచరిస్తుంది
పెద్దల్ని చూసి చరిస్తుంది
నిశితంగా గమనిస్తుంది
బాల్యం రేపటి భవిత
బాల్యం రేపటి తలరాత
ఆ భవిత బావుండాలన్న
ఆ తలరాత మారాలన్న
మనం గొప్పవాళ్ళం కానవసరం లేదు
మనం గొప్పత్యాగాలు చేయనవసరం లేదు
మనం మళ్ళీ బాలలమైతే చాలు
మనందరి భవిత బంగారమే


-శివ భరద్వాజ్
భాగ్యనగరం
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

*తిరస్కరణ కావాలి - ఆవిష్కరణ*

నిన్ను తిరస్కరిస్తే, నమస్కరించు,  నిరాశపడక ప్రయత్నించు,  నిరంతర సాధనతో పురోగమించు,  నిన్ను నవీకరించి, ఆవిష్కరించు,  గెలుపు పథాన తిరిగి పయనిం...