20, మే 2022, శుక్రవారం

జీవితం అంటే

 నేడు నిన్నవడం రేపు నేడవడం
రోజులు వారాలుగా వారాలు నెలలుగా
నెలలు సంవత్సరాలుగా మారడం కాదు
జీవితం అంటే వయసు పెరగడం కాదు
జీవితాన్ని జీవించామా
జీవితం సార్ధకత పొందిందా
జీవితంలో సాధించింది ఉందా
కోపాలు ద్వేషాలు
ఓరిమి లేని స్పందనలు
ఒక్క క్షణం బలహీనత బలహీన పరుస్తుంది
ఒక్క క్షణంలో జీవితం ఛిద్రమవుతుంది
ఒక్క క్షణం ఓపిక జీవితాలు నిర్మిస్తుంది
కోపంతో రగిలిపోతూ
పగతో సెగలుకక్కుతూ
ఎదుటివాడిని విమర్శిస్తూ
అరచేతిలో వినోదానికి బలహీనపడుతూ
బలమైన భాంధావ్యాలను బలహీనపరుస్తూ
బ్రతుకుబండి లాగిస్తున్న మానవుడా
ఇకనైనా మేలుకో
బ్రతుకంటే కాసులవేట కాదు
బ్రతుకంటే నువ్వే బ్రతకటం కాదు
బ్రతుకంటే మనతో పాటు పదిమందికి వెలుగునివ్వడం
బ్రతుకంటే జన్మభూమి సేవ చేయడం
బ్రతుకంటే తల్లిదండ్రుల అనాధలు చేయకుండటం
బ్రతుకంటే మనతో పాటు సమస్త జీవులను  బ్రతకనివ్వడం

- శివ భరద్వాజ్
భాగ్యనగరం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మనం దేనితో కలుస్తామో.. దానిగా మారిపోతున్నాం

 💝 ఓం పూర్ణమిదః పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే| పూర్ణస్య పూర్ణ మాదాయా పూర్ణమేవావశిష్యతే|| ఓం శాంతి శాంతి శాంతిః 💖 ~భగవంతుడు పూర్ణుడు. పూర...