31, మే 2022, మంగళవారం

నీ కులము నిలవాలన్న - నీ మతము గెలవాలన్న

నీ కులము నిలవాలన్న
నీ మతము గెలవాలన్న
నీకు స్వాతంత్య్రం ఉండాలన్న
నీ దేశం నీ వారి ఏలుబడిలో ఉండాలి కదన్న
నీ వాదన అపుడే కదా ఎవడైనా వినేది నెగ్గేది
నీ దేశం పరాయి పాలనలో ఉన్నపుడు
నీ స్వాతంత్ర్యం పోయినపుడు
నీ పరమావధి స్వాతంత్ర్యం అవుతుంది
నిన్ను సాటివాని నుండి వేరుచేసే కులము నీకెందుకు
నిన్ను సాటివాని నుండి దూరం చేసే మతము నీకెందుకు
కావాల్సింది సమగ్ర భారత అభివృద్ధి
నిలవాల్సింది భారతీయుల ఐకమత్యం
మనం చేయి చేయి కలిపితే కులముండదు
మనం పధం పధం కలిపితే ఎదురుండదు
కావాలి దేశమే నీ తొలి మంత్రము
కావాలి దేశమే నీ తొలి ఆత్రము
-శివ భరద్వాజ్
భాగ్య నగరం

30, మే 2022, సోమవారం

మానవులంతా సమానమని చాటాలి

కులపాముల కోర పెరికి
మత పాములపట్టి మట్టుపెట్టి
మురిపముల మూటకట్టి  
మూడు రంగుల జెండా
ముచ్చటగా నెగరాలి
మానవులంతా సమానమని చాటాలి
మంచిని మనము పెంచాలి
మమతను మనము పంచాలి
పక్షపాతమును వీడాలి
ప్రతిభకు పట్టం కట్టాలి
డబ్బులేక చదువు నాగక
ప్రతిభ యుండి ముందుకు సాగక
ప్రయాస పడకూడదు
విద్య వ్యాపారమగాలి
వైద్య మందరికందాలి
వృద్ధుల గౌరవం పెరగాలి
పెద్దల మాటలు వినాలి
పరిశీలన మనం చేయాలి
మంచితో ముందుకు సాగాలి
ఉచిత పంపకం ఆగాలి
సముచిత పని దొరకాలి.

----శివ భరద్వాజ్
భాగ్యనగరం

28, మే 2022, శనివారం

మానవ ధర్మ చంద్రుడిచ్చు చల్లని వెన్నెల మనకు

అజ్ఞానాంధకారంబు తిరుగు చిమ్మెట
దీపపు వెలుగు  శాశ్వతంబని అకటా!
దీపము చేరి దగ్ధంబగు
కుల మత నాయకుల గారడి మాటలు నమ్మి
వెలుగునిండు తమ జీవితంబులని తలిచి
వారి చేరి దగ్ధంబు కాకు
సత్యంబిది స్వధర్మ సూర్యుడు రక్ష మనకు
మానవ ధర్మ చంద్రుడిచ్చు చల్లని వెన్నెల మనకు
-- శివ భరద్వాజ్
భాగ్య నగరం

అకటా - అయ్యో

22, మే 2022, ఆదివారం

మళ్ళీ బాలలమైతే చాలు - మనందరి భవిత బంగారమే

మళ్ళీ బాలలమైతే చాలు - మనందరి భవిత బంగారమే


ఏ భాద్యత లేనిది ఏ బరువు మోయనిది
ఏ కల్మషం లేనిది ఏ మరక అంటనిది
కల్లాకపటం ఎరగనిది
చల్లమనసు కలిగినది
మతమౌమౌఢ్యము అంటనిది
కుల జాఢ్యము తెలియనిది
ఏ మరక అంటని తెల్లని వస్త్రమది
ఏ రాత రాయని తెల్ల కాగితమది
స్వచ్ఛంగా ఉంటుంది
స్వచ్ఛంగా నవ్వుతుంది
నవ్వుతూ పలకరిస్తుంది
సంతోషంతో చరిస్తుంది
సాటివానికి సాయం చేస్తుంది
అందరినీ సమదృష్టితో చూస్తుంది
పెద్దల్ని చూసి అనుకరిస్తుంది
పెద్దల్ని చూసి ఆచరిస్తుంది
పెద్దల్ని చూసి చరిస్తుంది
నిశితంగా గమనిస్తుంది
బాల్యం రేపటి భవిత
బాల్యం రేపటి తలరాత
ఆ భవిత బావుండాలన్న
ఆ తలరాత మారాలన్న
మనం గొప్పవాళ్ళం కానవసరం లేదు
మనం గొప్పత్యాగాలు చేయనవసరం లేదు
మనం మళ్ళీ బాలలమైతే చాలు
మనందరి భవిత బంగారమే


-శివ భరద్వాజ్
భాగ్యనగరం
 

20, మే 2022, శుక్రవారం

జీవితం అంటే

 నేడు నిన్నవడం రేపు నేడవడం
రోజులు వారాలుగా వారాలు నెలలుగా
నెలలు సంవత్సరాలుగా మారడం కాదు
జీవితం అంటే వయసు పెరగడం కాదు
జీవితాన్ని జీవించామా
జీవితం సార్ధకత పొందిందా
జీవితంలో సాధించింది ఉందా
కోపాలు ద్వేషాలు
ఓరిమి లేని స్పందనలు
ఒక్క క్షణం బలహీనత బలహీన పరుస్తుంది
ఒక్క క్షణంలో జీవితం ఛిద్రమవుతుంది
ఒక్క క్షణం ఓపిక జీవితాలు నిర్మిస్తుంది
కోపంతో రగిలిపోతూ
పగతో సెగలుకక్కుతూ
ఎదుటివాడిని విమర్శిస్తూ
అరచేతిలో వినోదానికి బలహీనపడుతూ
బలమైన భాంధావ్యాలను బలహీనపరుస్తూ
బ్రతుకుబండి లాగిస్తున్న మానవుడా
ఇకనైనా మేలుకో
బ్రతుకంటే కాసులవేట కాదు
బ్రతుకంటే నువ్వే బ్రతకటం కాదు
బ్రతుకంటే మనతో పాటు పదిమందికి వెలుగునివ్వడం
బ్రతుకంటే జన్మభూమి సేవ చేయడం
బ్రతుకంటే తల్లిదండ్రుల అనాధలు చేయకుండటం
బ్రతుకంటే మనతో పాటు సమస్త జీవులను  బ్రతకనివ్వడం

- శివ భరద్వాజ్
భాగ్యనగరం

18, మే 2022, బుధవారం

స్పందించేందుకు సమయం లేదు

 స్పందించేందుకు సమయం లేదు
వివరించేందుకు విషయం లేదు
వినేటందుకు ఓపిక లేదు
తెలుసుకునేంత తీరిక లేదు
మన బ్రతుకేదో బ్రతికేస్తున్నాం
మన చావేదో చస్తూవున్నాం
ఎన్నాళ్లయిన కుక్కలు, నక్కలు
పందుల వలె బ్రతికేస్తున్నాం
తీరుబడి లేక జీవిస్తున్నాం
ఎంతసేపు నేను బావుండాలి
నా కుటుంబం బావుండాలనే
తపనే తప్ప నా ఊరు నా దేశం
బావుండాలనే భావన లేక బ్రతికేస్తున్నాం  
- శివ భరద్వాజ్
భాగ్య నగరం.

మహా శివ రాత్రి : శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది?

శివుడికి అసహజమైన ఆ మూడో కన్ను ఎందుకు? దాని వెనక దాగివున్న రహస్యం, ప్రత్యేకత ఏమిటి?             తక్కిన దేవతామూర్తుల నుంచి వేరుచేసి చూపేది పరమ...