🔱 అంతర్యామి 🔱
# జన జీవన సుధా...
🍁భారతీయ సమాజంలో రామాయణం గురించి
తెలియని వారుండరు. ఈ కావ్యాన్ని విని, చదివినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. అందులోని విలువలను అర్థం చేసుకొని పాటించినప్పుడే మన ప్రవర్తనలో పరివర్తనకు అవకాశం ఉంటుంది. రామాయణంలో నాయక పాత్రల్ని గుర్తుచేసుకొంటే ఏదో తెలియని ఉత్తేజం, ఉల్లాసం ఎగిసిపడతాయి. వారిపట్ల ఆరాధనాభావం కలుగుతుంది. కానీ ప్రతినాయకుల్ని గుర్తుచేసుకొంటే ఆవేశం పెల్లుబికి వారిపట్ల ప్రతీకార, తిరస్కార భావాలు ఏర్పడతాయి. మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదనే విచక్షణా జ్ఞానం అందరిలోనూ ఉంటుంది. కాకపోతే తనలో ఉన్నవన్నీ నాయకుడి లక్షణాలే, ప్రతినాయకుడి గుణాలు మచ్చుకైనా లేవని ఎవరికివారు భావిస్తుంటారు. ఎదుటి వాణ్ని మాత్రం ప్రతినాయకుడిగా ఊహించడం చాలామందిలో ఉన్న దుర్గుణం. ఈ తత్త్వం మనిషి ఎదుగుదలకు అడ్డుగోడ వంటిది. ప్రతి ఒక్కరిలోనూ రెండు రకాల గుణాలూ ఉంటాయి. నాయకుడి గుణాలు బయటికొస్తే ప్రశంసలు కురుస్తాయి. ప్రతి నాయకుడి లక్షణాలు విజృంభిస్తే అరాచకం, అశాంతి నెలకొంటాయి..
🍁రామాయణాన్ని మంధర మలుపు తిప్పింది. మాయమాటలతో కైక మనసు విరిచింది. కేవలం మంధర వక్రబుద్ధే రాముణ్ని అడవులకు పంపి, దశరథుడి ప్రాణాలు తీసింది. వ్యక్తిలోని దుర్గుణాలు బయటికి వచ్చాయంటే ఊహకు అందని విషవలయం ఏర్పడి అపార్థాలు సృష్టిస్తుంది. మంధరలా మాట్లాడేవారు సమాజంలో చాలామంది ఉంటారు. అయోధ్యకు తిరిగొచ్చిన భరతుడు జరిగినదంతా తెలుసుకుని కోపంతో తల్లిని దూషించాడు. తిన్నగా రాముడి దగ్గరికెళ్లి అయోధ్యకు తిరిగి రమ్మని బతిమలాడాడు. చివరికి పాదుకల్ని తీసుకెళ్ళి పట్టాభిషేకం చేసి అధికారానికి, కీర్తి ప్రతిష్ఠలకు అతీతుడినని నిరూపించుకొన్నాడు. ఇవన్నీ చూసి భరతుణ్ని కొనియాడుతున్నామే కానీ ఆయన ఆదర్శభావాలను మనం ఎంతవరకు ఆచరించగల్గుతున్నాం?
🍁రామలక్ష్మణులను చూసి శూర్పణఖ మోహించింది. వారు తిరస్కరించారు. అందుకామె తన అన్న రావణుడితో వారిపై లేనిపోనివన్నీ కల్పించి చెప్పింది. ఫలితంగా యుద్ధం జరిగి రావణుడు మరణించాడు. రావణుడు సీతమ్మను తీసుకువెళ్తుండగా జటాయువు అడ్డుపడి అతడితో పోరాడి అసువులు బాసింది. నేటి సమాజంలో పట్టపగలే ఆడపడచుల పట్ల అకృత్యాలు, అత్యాచారాలు జరుగుతుంటే చూస్తూ వెళ్లిపోతుంటారు చాలామంది.
🍁ప్రతి వ్యక్తి తన జీవితంలో ప్రేమ, దయ, నిస్వార్థం, త్యాగం, పరోపకార గుణం అనే ఐదు దైవీ గుణాలను అలవరచుకొని మంచి మార్గాన ముందుకెళ్లాలి. క్రూరత్వం, కపట స్వభావం, నిర్దయ, స్వార్ధ బుద్ధి వంటి అసుర గుణాలను దరిచేరనివ్వకూడదు. మనిషి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో రామాయణ • పాత్రలు చక్కగా చెప్పాయి. ఈ కావ్యం బోధించిన జీవన విలువల్ని అర్థం చేసుకొని పాటించగలిగితే మానవజన్మ ధన్యం.🙏
- ✍️యం.సి. శివశంకర శాస్త్రి
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ బ్లాగు వివిధ సందర్భాల్లో నా స్పందనకు అక్షర రూపం. జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలకు ప్రతిరూపం.
26, సెప్టెంబర్ 2024, గురువారం
🔱 అంతర్యామి 🔱
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మహా శివ రాత్రి : శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది?
శివుడికి అసహజమైన ఆ మూడో కన్ను ఎందుకు? దాని వెనక దాగివున్న రహస్యం, ప్రత్యేకత ఏమిటి? తక్కిన దేవతామూర్తుల నుంచి వేరుచేసి చూపేది పరమ...
-
మాటలు చెప్పుటేగాని మరి నిజముగ చేయ రాదు అడిగిన తరుణమున మురియ, ఆదుకొనగ చేత గాదు సాయము చేయు వారి మనసా! నువు వెన్నవా? కాదు మాయెడల దయ చూపు ...
-
డబ్బు జబ్బు చేసిన మనిషికి గౌరవం మబ్బు చాటుకి వెళ్లిన తెలియటం లేదు తెలిసినా పట్టించుకోవడం లేదు నిబ్బు మందుతో జోగుతూ, కులం కైపుతో తూలుతున్నా ...
-
కరోనా సంతోషం కలిగించింది జనాలను నిలువు దోపిడి చేస్తున్న వైద్యాలయాలకు టీకాల తో వ్యాపారం చేస్తున్న మందుల కంపెనీ లకు మందులను బ్లాక్ మార్కెట్ చ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి