12, జూన్ 2024, బుధవారం

కరుగునేమో కరుకు గుండెయైన

తేటగీతి:

కరుగునేమో కరుకు గుండెయైన ఆర్తి
వేడుకొన, కరగదు ముష్కరి హృదయంబు,
కరుణయన్నది లేక ప్రాణములు తీయు,
మారుట జరుగదు మహిలో వారు. రామ!

 

భావం: రామ! కరుకు గుండె అయినా ప్రార్ధిస్తే కరగవచ్చునేమో, తీవ్రవాదముతో తుపాకి పట్టిన వాడి హృదయం కరగదు,  కరుణ చూపక ప్రాణములు తీస్తూనే ఉంటారు. ఈ భూమిపై వారు మారుట జరగదు.

-శివ భరద్వాజ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

విజయ కమల వికాసం

మనుసులో ఆశల అలలు ఎగిసిపడుతుంటే, ఊహలు కొండదాటిపోతున్నాయి. మదిలో కోరికలు సుడులు తిరుగుతుంటే, కళ్ళు ఓటమి భయంతో బెదురుతున్నాయి. చేయగలనన్న ధీ...