12, నవంబర్ 2023, ఆదివారం

*ఊరు పిలుస్తుంది - ఊరడిల్లమంటుంది*

 మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.

*ఊరు పిలుస్తుంది - ఊరడిల్లమంటుంది*

మీ రాక కోసం కళ్ళలో కాకరపువ్వొత్తులు పెట్టుకొని కన్నఊరు  ఎదురుచూస్తుంది.
మీరందరు వచ్చి భూచక్రంలా ఊరంతా కలతిరగాలని ఆశ పడుతుంది.
మిత్రుల ఆత్మీయ ఆలింగనలలో తాడులా వెలుగుతూ అల్లుకుపోవాలంటుంది.
కోపతాపాల బాంబుల మోతలతో దద్దరిల్లింది చాలు,
చిచ్చుబుడ్డీల ఆనందాలు వెదజల్లాలని ఆశపడుతుంది.
విష్ణుచక్రంలా బతుకు చక్రంలో తిరిగే మీరు ఆటవిడుపుకు రమ్మంటుంది.
పాము బిళ్ళల బుసబుసలు మాని అన్నంముద్ద వెలుగులు వెదజల్లమంటుంది.
మీరు తారాజువ్వలా మీ జీవితాలలో విజయం సాధించాలని,
కానీ నేలనున్న మీ స్నేహితులను మరిచిపోవద్దని,
కలుసుకునేందుకు ఒకసారి తీరుబడి జేసుకు రమ్మంటుంది.
మిమ్మల్ని  కాసింత ఊరడిల్లమంటుంది.

- శివ భరద్వాజ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ శ్రమని దాచిపెట్టి పిల్లలను పెంచకండి.

 పరుల సొమ్ము ఎంత విలువైనదైనా అది మనది కాదు. మనది కానిది ఆశించటం మంచిది కాదు. మీ శ్రమని దాచిపెట్టి పిల్లలను పెంచకండి. మీరు ఎంత శ్రమించి పెంచు...