3, మే 2023, బుధవారం

కాలం కరుణ లేనిది

కాలం కరుణ లేనిది


కాలం కరుణ లేనిది
క్షణకాలం నీ కోసం నాకోసం అగనంటుంది
తీపి జ్ఞాపకాలున్నా
చేదు నిజాలున్నా
ఏది ఏమైనా
సంతోష శుభోదయమైనా
విషాదసంధ్యా సమయమైనా
ఏ పరిస్థితెదురైనా
కాలం ఆగక ముందుకెళుతూనే ఉంటుంది

ఒక బంధాన్ని నిర్దయగా తుంచేస్తుంది
ఒక బంధాన్ని కొత్తగా చిగురింపచేస్తుంది
నువ్వు పొగిడినా పొంగిపోదు
నువ్వు తిట్టినా కుంగిపోదు
ఎన్నడూ తన పయనం మాత్రం ఆపబోదు
ఎప్పుడు తన గమనం మాత్రం ఆగిపోదు

కాలం కరుణ లేనిది
నువ్వు గెలిచావని ఆకాశాన్ని తాకినా
నువ్వు ఓడావని నేలపైన పడినా
తాను ముందుకెళుతూనే ఉంటుంది
కాలం కరుణ లేనిదని ఆడిపోసుకోకు
అన్నిటిని అర్ధం చేసుకో
ఆగిపోక ముందుకు సాగిపో
జీవితాన్ని జీవించడం నేర్చుకో  
కాల తత్వాన్ని అర్ధం చేసుకో
 

- శివ భరద్వాజ్
లైఫ్ కోచ్, వెల్త్ అడ్వైజర్ & కన్సల్టెంట్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డబ్బు ఉంటే సుఖమే, ఇది నిజమే!

 డబ్బు ఉంటే సుఖమే, ఇది నిజమే! డబ్బు చేసిన మనిషి, జబ్బు చేసిన మనిషి ఒకటే, ఇదీ నిజమే! పడవ పయనం సాగాలంటే, నీటి అవసరం నిజమే! పడవలోకి నీరు పయనిస్...