21, నవంబర్ 2025, శుక్రవారం

ఒక్క మనిషి మారితే చాలు

ఈ రోజుల్లో మనం మనుషుల మధ్య ఉన్నామా…
లేక యంత్రాల మధ్య ఉన్నామా! తేడా తెలియడం లేదు.
చుట్టూ అందరూ ఉన్నారు… కానీ ఏ ఒక్కరూ మనతో లేరు.
అందరూ తమ తమ మొబైల్ తో బిజీ గా ఉన్నారు.  పక్కవారిని పట్టించుకునే తీరిక లేదు.

ఒకప్పుడు మాటలతో బంధాలు ఏర్పడేవి,
ఇప్పుడు మెసేజ్‌లతో బంధాలు ఏర్పడి కుటుంబాలలో మాయమవుతున్నాయి.
ఒకప్పుడు నవ్వు పంచుకునేవాళ్ళం,
ఇప్పుడు లైక్‌ కోసం నవ్వుతున్నాం.

ఒక అమ్మాయి యూట్యూబ్‌లో ‘How to kill an old lady’ అని సెర్చ్ చేసి…
తన అత్తగారిని చంపింది.
ఒక అబ్బాయి ప్రమాదంలో ఉన్నవాడిని చూసి…
ఆతడిని కాపాడకుండా, అతని మొబైల్ దొంగిలించాడు.
తల్లిదండ్రులు పిల్లలకు భారంగా మారుతున్నారు.
బంధాలు బీటలువారి, వ్యక్తిగత సుఖాల కొఱకు తల్లిదండ్రులు బిడ్డలను, బిడ్డలు తల్లిదండ్రులను, భార్యలు భర్తలను, భర్తలు భార్యలను  అంతం చేస్తున్నారు.
డబ్బుల కొఱకు ఏ పని చేయడానికైనా వెనుకాడడం లేదు.


“ఇంత దూరం మనం వచ్చేశామా?
మనిషి మనిషిని నమ్మలేని స్థితికి చేరుకున్నామా?
మనం కోల్పోయింది ఏమిటి? ప్రేమా? విలువలా? లేక మనసా?”

“కానీ…
ఈ చీకటిలో కూడా ఒక్క దీపం వెలిగితే చాలు.
ఒక్క మనిషి మనసు మేల్కొంటే చాలు.”


“ఒక మంచి పని,
ఒక చిరునవ్వు,
ఒక క్షమాపణ,
ఒక సహాయం —
అదే ప్రపంచాన్ని మార్చే మొదటి అడుగు.”


“మనమంతా మార్చాల్సిన అవసరం లేదు.
ఒక్క మనిషిని మార్చితే చాలు.
అతడు ఇంకొకరికి వెలుగు అవుతాడు.
ఆ వెలుగు ఇంకొకరిని తాకుతుంది.
అదే మార్పు యొక్క మొదటి అడుగు.”


“అంధకారాన్ని తిట్టకండి…
దీపం వెలిగించండి. చీకటి అదే మాయం అవుతుంది
ఎందుకంటే,
మార్పు ఎక్కడో కాదు — మనలోనే జరగాలి - మనతోనే మొదలవ్వాలి. అప్పుడు అది అందరిలోను మొదలవుతుంది. వెలుగులు నింపుతుంది”


ఒక్క మనిషి మారితే చాలు.

 ప్రపంచంలో ప్రేమ, ఆప్యాయత, అనురాగం తిరిగి కొత్త చిగుర్లు వేస్తాయి. 

ఈ మార్పుకు అతి సులువయిన మార్గం.........

ఆ మారే ఒక్కరు, మీరైతే చాలు. 

ఎలా ఈ ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నారో అలా మీరుంటే చాలు.


-శివ భరద్వాజ్

13, నవంబర్ 2025, గురువారం

ఓ హిందువా మేలుకో ఒకసారి

ఓ హిందువా మేలుకో ఒకసారి
ఓ హిందువా మేలుకో ఒకసారి

సత్యము ధర్మము ఊపిరిగా
న్యాయము చట్టము దేహముగా
ప్రకృతి రక్షా కవచముగా
వికృతి దండన చేయంగా

ఓ హిందువా మేలుకో ఒకసారి
ఓ హిందువా మేలుకో ఒకసారి

కులములు కలిసి నడవంగా
సమతా దీపిక వెలగంగా
బాధ్యత తెలిసి మెలగంగా
శాంతి సౌఖ్యము విరియంగా

ఓ హిందువా మేలుకో ఒకసారి
ఓ హిందువా మేలుకో ఒకసారి

కుటుంబ విలువలు పడుతుంటే
వృద్ధులు బరువని అంటావా
అందరూ కలిసి మెలిసుంటే
పిల్లల భవితే బంగారం

ఓ హిందువా మేలుకో ఒకసారి
ఓ హిందువా మేలుకో ఒకసారి

పూజా పద్ధతి ఏదైనా
మారని మమతలు పంచాలి
ప్రాంతం, భాషా వేరైనా
భారతి తల్లిగా తలవాలి

ఓ హిందువా మేలుకో ఒకసారి
ఓ హిందువా మేలుకో ఒకసారి

- శివ భరద్వాజ్

ఓడిపోతున్న క్షణాల్లో విజయం సాధించిన సత్య కథ

 "ఓడిపోతున్నట్టే అనిపించే రోజులు… ఫలితం రాకపోయినప్పుడు వచ్చే నిరాశ… ఇవే, మీ జీవితాన్ని మార్చే సీక్రెట్ కీ అవుతాయంటే… విశ్వసించగలరా?...