16, అక్టోబర్ 2025, గురువారం

*తిరస్కరణ కావాలి - ఆవిష్కరణ*

నిన్ను తిరస్కరిస్తే, నమస్కరించు, 
నిరాశపడక ప్రయత్నించు, 
నిరంతర సాధనతో పురోగమించు, 
నిన్ను నవీకరించి, ఆవిష్కరించు, 
గెలుపు పథాన తిరిగి పయనించు. 
మూసిన తలుపులు తెరిచి,
నిన్ను ఆహ్వానించు.
కొత్త వెలుగు, కొత్త లోకం.
 
- శివ భరద్వాజ్ . 

15, అక్టోబర్ 2025, బుధవారం

పోలిక ఎవరితో

పోలికల ప్రపంచంలో మనల్ని మనం కోల్పోకుండా ఉండాలి.
నిన్నటి నీతో ఈరోజు నిన్ను పోల్చుకో…
రేపటి నీతో నేటి నిన్ను పోల్చుకో…
మెరుగయ్యావా లేదా చూసుకో.
నువ్వే నీకు పోటీ అని తెలుసుకో.

- శివ భరద్వాజ్ 

ఓడిపోతున్న క్షణాల్లో విజయం సాధించిన సత్య కథ

 "ఓడిపోతున్నట్టే అనిపించే రోజులు… ఫలితం రాకపోయినప్పుడు వచ్చే నిరాశ… ఇవే, మీ జీవితాన్ని మార్చే సీక్రెట్ కీ అవుతాయంటే… విశ్వసించగలరా?...