💝 ఓం పూర్ణమిదః పూర్ణమదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే|
పూర్ణస్య పూర్ణ మాదాయా పూర్ణమేవావశిష్యతే||
ఓం శాంతి శాంతి శాంతిః
💖 ~భగవంతుడు పూర్ణుడు.
పూర్ణానికి పూర్ణం కలిపినా, పూర్ణంలోంచి పూర్ణం తీసేసినా మిగిలేది పూర్ణమే.
❤️ ~ఇదే శ్రుతి వాక్యం. ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటే... జీవితమంతా ఇందులోనే ఉంది. మోక్ష మార్గం ఇందులోనే దాగి ఉంది. సమస్త సాధనాల సారం ఇందులోనే ఉంది.
💕 0 + 0 = 0
💕 0 ౼ 0 = 0
💞 కానీ...
💓 0+1 = ఎంత అంటే.....మనం వెంటనే 1 అని సమాధానమిస్తాం.
❤️ ఇక్కడ సున్నా ...ఒకటితో కలవగానే 1 గామారిపోయింది.
💓 0+2 =2....
❤️ సున్నా 2 తో కలవగానే సున్న మాయమై రెండుగా మారింది.
💞 అంటే.....సున్నా దేనితో కలిస్తే దానిలా మారిపోతూంది.
💝 గాఢ నిద్రలో మనం పూర్ణమైన భగవంతుడిగా ఉంటాం.
💖 మనకప్పుడు ఏ భావోద్వేగాలు ఉండవు. సున్నలాంటి మనం నిద్రలేవగానే ప్రకృతితో ఎప్పుడైతే కలుస్తున్నామో మనం అప్పటికప్పుడే ప్రకృతే ఐపోతున్నాం.
💓 మనం దేనితో కలుస్తామో.. దానిగా మారిపోతున్నాం.....
♦️ బాగా గమనించాలి.
💕 నీ ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు...అతడు గతంలో నీకు ఎంతగానో సహాయం చేసాడు…
ఆ వ్యక్తిని చూడగానే...నీలో అతనిపట్ల ఆత్మీయత కలుగుతుంది. నువ్వూ అతనికి ఎలాగైనా సహాయం చెయ్యాలని ఆలోచిస్తావు.
💕 ఒక వ్యక్తి నిన్ను ఎంతగానో బాధించాడు...అతను కనబడగానే నువ్వు కూడా అతన్ని ఎలాగైనా బాధించాలని ఆలోచిస్తావు.
❤️ ఎదుటి వ్యక్తి ప్రేమతో వస్తే..నీకూ అతనిపట్ల ప్రేమ కలుగుతోంది.
❤️ ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవిస్తే నీకూ అతనిపట్ల గౌరవం కలుగుతున్నది. అంటే...
💖 మనం ఎదుటి వ్యక్తిలోని ఏ గుణాన్నాయితే గమనిస్తున్నామో..
మనం మనకు తెలీకుండానే ఆ గుణంతో కలిసిపోయి....ఆ గుణంగానే మారిపోతున్నాం.
💝 మనం దేనితో కలుస్తున్నామో... దానిలా మారిపోతున్నాం.
💓 మనలో సున్నా (0) లా ఉన్న పరమాత్మతత్వం...ఎదుటి వ్యక్తీలోని కోపంతో కలవగానే అది కోపంగా మారి మనకు కోపం వస్తుంది.
❤️ నువ్వు ప్రేమతో కలిస్తే ప్రేమగా, ద్వేషంతో కలిస్తే ద్వేషంగా మారిపోతావ్.
💝 ఎదుటివారిలోని అహంకారాన్ని చూస్తే నీలో కూడా అహంకారం మొలుస్తుంది.
❤️ అందుకే....
💞 ప్రతి జీవిలోనూ, మనిషిలోనూ పరమాత్మ ఉన్నాడని గ్రహించి ఆయనతో అనుసంధానం అవ్వు.
💝 అంటే నీలోని పూర్ణాన్ని ఎదుటి వ్యక్తీలోని పూర్ణంతో కలుపు.
వచ్చేది పూర్ణమే.
💖 ఎదుటి మనిషిని చూడగానే అతనిలోని దోషాలను గుర్తిస్తే మనం అతనిలో దేన్ని ముందుగా చూస్తామో మనం అదిగా మారిపోతామన్న మహా సత్యాన్ని గమనించాలి.
❤️ అందుకే ఎలాంటి వారిలోనైనా భగవంతుణ్ణి చూడగల్గి ఆయనతో కలిస్తే...మనం కూడా భగవత్ తత్వంగా మారిపోతాము.
💕 సదా ఈ సృష్టిలోని ప్రతి వస్తువులోనూ పరమాణు స్వరూపంతో ఉన్న భగవంతునితో అనుసంధానమవుతూ ఉండాలి.
💞 అంటే మంచి చెడు తటస్థ లక్షణాల్లో,అన్ని గుణాలలో, అన్ని ఆలోచనలలో, అన్ని అనుభూతుల్లో, మనోభావాల్లో, అనారోగ్య లక్షణాల్లో, ఆరోగ్య లక్షణాలలో, పూర్ణాన్ని అనుభూతి చెందాలన్నమాట.
💝 ఇక్కడ పూర్ణం లేదా భగవంతుడు అంటే నిరాకారం, వ్యాపకం, నిశ్చలం, నిర్గుణం, సచ్చిదానంద స్వరూపం,తృప్తి, బ్రహ్మానందం, ప్రశాంతత.
ॐ నమో భగవతే వాసుదే వాయ🙏
ఈ బ్లాగు వివిధ సందర్భాల్లో నా స్పందనకు అక్షర రూపం. జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలకు ప్రతిరూపం.
21, నవంబర్ 2024, గురువారం
మనం దేనితో కలుస్తామో.. దానిగా మారిపోతున్నాం
20, నవంబర్ 2024, బుధవారం
ఏడుచేపల కథ - అంతరార్ధం
ఈ కథ ఎందుకు పుట్టింది.!!
అనగనగా ఒక రాజు,
ఆ రాజుకు ఏడుగురు కొడుకులు..
ఏడుగురు కొడుకులు ఒకనాడు వేటకు వెళ్ళి ఏడు చేపలను వేటాడారు.
ఎన్నో అసహజాలు, అసంగతాలయిన సన్నివేశాలు ఉన్నా, ...
రీజనింగ్ అడగకుండా, ఆలోచించకుండా
వినే గొప్ప తెలుగు కథ
ఈ #ఏడు_చేపల_కథ..
నిజానికి రాజు గారి కొడుకులకు చేపలు వేటాడాల్సిన కర్మ ఏం పట్టింది.
అడవికి పోయి క్రూర మృగాలను వేటాడవచ్చు కదా!
అయినా ఎవ్వరూ
ఈ ప్రశ్న వేయరు.
చెరువుకు పోయి చేపలు తెచ్చారే అనుకుందాం.
వాటిని ఎండబెట్టడానికి, ఎండిన వాటిని ఎత్తి పోసుకోవడానికి వారి దివానుల్లో నౌకర్లే కరువయ్యారా...
నిజానికి ఈ ప్రశ్న
ఎంతో వ్యాలిడ్ ప్రశ్నే..
అయినా ఎవ్వరూ
ఈ కోణం నుంచి ప్రశ్న వేయరు.
అందుకే
ఈ కథను జాగ్రత్తగా గమనిస్తే,
చదువుకుంటే అనేక అంతరార్థాలు,
పైకి కనిపించని విశేషాలు స్ఫురిస్తాయి..
రాజు గారు అంటే మనిషి..
ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషి లోని సప్త ధాతువులు.
కొడుకులు వేటకు వెళ్ళడమూ అంటే..
మనిషి జీవితాన్ని కొనసాగించడం.
జీవితమే ఒక వేట.
వేటే ఒక జీవితం.
రాజకుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే ..
మనిషికి ఉండే అరిషడ్ వర్గాలు ( అనగా 6 )
1. కామ
2. క్రోధ
3. లోభ
4. మోహ
5. మద
6. మాత్సర్యాలు
వీటన్నింటిని మనిషి సాధన చేసి ఎండ గట్టవచ్చు..
అంటే పూర్తిగా నియంత్రించవచ్చు.
అందుకే కథలో
ఆరు చేపలను
ఎండ గట్టినట్టు చెప్పారు.
రాజు గారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు.
ఏమిటా చేప.?
అది మనస్సు
దీన్ని జయించడం
చాలా కష్టం.
ఎంత ప్రయత్నించినా
అది ఎండదు.
మనస్సు అంటే ఏమిటి..?
మనస్సు అంటే
సంకల్ప వికల్పాలు.
ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచు కొస్తుంది.
మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవిత కాలం చాలదు.
కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాట పడుతుంటారు.
మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే.
ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు.
ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది..?
గడ్డిమేటు.
గడ్డిమేటు
అంటే ఏమిటి.?
కుప్పపోసిన అజ్ఞానం.
గడ్డిమేటులా పేరుకు పోయిన అజ్ఞానాన్ని తొలగించాలంటే ఎలా.?
మామూలు గడ్డికుప్ప అయితే గడ్డి పరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు.
కానీ
అజ్ఞానం అలాంటిది కాదు.
జ్ఞానదాయకమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డి పరకలను లాగినట్టే.
ఆ కుప్ప తరిగేది కాదు., తగ్గేది కాదు.
దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం.
మరి
అది పోవాలంటే
ఏం చేయాలి.!!
ఆవు వచ్చి మేయాలి.
ఆవు ఎక్కడనుంచి రావాలి.?
అసలు..
ఆవు అంటే ఏమిటి.?
ఆవు అంటే
#జ్ఞానం.
జ్ఞానం అనే ఆవు
దొడ్లో ఎగబడి మేస్తే..
అజ్ఞానం అనే గడ్డి కుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది.
లేదూ…
జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.
అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు.
(జ్ఞానాగ్ని దగ్ధకర్మాణాం)
జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధ పురుషుడు, యోగ పురుషుడు మాత్రమే.
ఈ గోవును
ఎవరు మేపాలి.?
గొల్లవాడు మేపాలి. గొల్లవాడు అంటే ఎవరు..?
సమర్ధ సద్గురుడు, జగద్గురుడు.
జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా..
అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞాన రూపంగా మనందరికి ధారపోశాడు.
ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు.
ఏమిరా నాయనా.. ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.
ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు..?
అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ పెద్దమ్మ.
ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.
ఈ జగన్మాత అన్నం పెట్టక పోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు.
ఓ జగన్మాతా..
ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది.
ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు..?
ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు.
ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు..?
వాడికి చీమ కుట్టింది.
ఎక్కడిది చీమ.?
దానికి
ఇంకోపేరే సంసారం.
సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు.
ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడి కన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్లవాడినే చూసుకుంది.
మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టక పోవడం వలన తన విధిని నిలిపి వేశాడా..?
లేదు...
అమ్మ ద్వారా తన పనిలో భాగమైన శిష్ట రక్షణను చేసుకున్నాడు.
చీమ కుట్టినందుకు
కథలో పిల్లవాడు ఏడ్చినట్టే..
సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం.
మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి.
చీమలు
పుట్టలోనే ఉంటాయి.
ఏమిటీ ఈ పుట్ట.?
మనిషికి ఉండే సంసారం
ఒక పుట్ట.
ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే
మన పెద్దలు
మన బాల్యంలోనే..
ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశారు. 🤗
మహా శివ రాత్రి : శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది?
శివుడికి అసహజమైన ఆ మూడో కన్ను ఎందుకు? దాని వెనక దాగివున్న రహస్యం, ప్రత్యేకత ఏమిటి? తక్కిన దేవతామూర్తుల నుంచి వేరుచేసి చూపేది పరమ...
-
మాటలు చెప్పుటేగాని మరి నిజముగ చేయ రాదు అడిగిన తరుణమున మురియ, ఆదుకొనగ చేత గాదు సాయము చేయు వారి మనసా! నువు వెన్నవా? కాదు మాయెడల దయ చూపు ...
-
డబ్బు జబ్బు చేసిన మనిషికి గౌరవం మబ్బు చాటుకి వెళ్లిన తెలియటం లేదు తెలిసినా పట్టించుకోవడం లేదు నిబ్బు మందుతో జోగుతూ, కులం కైపుతో తూలుతున్నా ...
-
కరోనా సంతోషం కలిగించింది జనాలను నిలువు దోపిడి చేస్తున్న వైద్యాలయాలకు టీకాల తో వ్యాపారం చేస్తున్న మందుల కంపెనీ లకు మందులను బ్లాక్ మార్కెట్ చ...