మాటలు చెప్పుటేగాని మరి నిజముగ చేయ రాదు
అడిగిన తరుణమున మురియ, ఆదుకొనగ చేత గాదు
సాయము చేయు వారి మనసా! నువు వెన్నవా? కాదు
మాయెడల దయ చూపు మా మహా దేవుడవే కదూ!
ఈ బ్లాగు వివిధ సందర్భాల్లో నా స్పందనకు అక్షర రూపం. జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలకు ప్రతిరూపం.
25, ఆగస్టు 2023, శుక్రవారం
మాటలు చెప్పుటేగాని మరి నిజముగ చేయ రాదు
తెలుసుకుంటావా ఓ మానవుడా !
డబ్బు జబ్బు చేసిన మనిషికి గౌరవం మబ్బు చాటుకి వెళ్లిన తెలియటం లేదు తెలిసినా పట్టించుకోవడం లేదు
నిబ్బు మందుతో జోగుతూ, కులం కైపుతో తూలుతున్నా సిగ్గు పడటం లేదు పడినా పట్టించుకోవడం లేదు.
జవసత్వాలు ఉడిగినా మానవత్వపు జాడ మరుగవుతున్నా మతం చిచ్చు ఆరడం లేదు ఆరినా రాజేయడం ఆపడం లేదు.
యవ్వన మోహంలో కన్నవారిని, తమ కన్నవారిని, కట్టుకున్న వారిని కడతేర్చగ వెనకాడడం లేదు ఆడినా మోహపు మత్తు ఆగనివ్వడం లేదు.
తాము బ్రతుకుతున్నది అద్దాల మేడలో అని రాయి తాము విసిరినా
తమపై ఎదుటి వారు విసిరినా నిలువ నీడ లేనిది తమకేనని ఏనాటికైనా
తెలుసుకుంటావా ఓ మానవుడా ! విధి ఆటకు నువ్వు రాజువైన
బంటువైన చేరేది ఒకే విడిదికని తెలుసుకుంటావా ఓ మానవుడా !
ఓటు నా చేతిలో… అధికారం మాత్రం వారి చేతిలో!
ఓటు వేసేది నేనే… పన్ను కట్టేది నేనే… ఆట ఆడేది మాత్రం వారే! కోట కట్టేది మాత్రం వారే! అరాచక చదరంగంలో, రాజు ప్రజలే అయినా… మంత్రుల చేతిలోనే అధిక...
-
ఆకృతినీయుడు అవని మట్టితో, అలంకరించుడు ఓషధీయ పత్రితో, పూజచేయుడు నిజగృహ పూలతో, నివేదించుడు ముదమున మోదకములతో, నిమజ్జనచేయుడు విగ్రహము నీటితో, గ...
-
డబ్బు జబ్బు చేసిన మనిషికి గౌరవం మబ్బు చాటుకి వెళ్లిన తెలియటం లేదు తెలిసినా పట్టించుకోవడం లేదు నిబ్బు మందుతో జోగుతూ, కులం కైపుతో తూలుతున్నా ...
-
రోగ కారణానికి కాకుండా , రోగ లక్షణాలకు వైద్యం చేస్తే రోగం నయం కాదు. - శివ భరద్వాజ్ మనం శారీరకంగా కాదు, మానసికంగా లేదా ఆత్మీయంగా ఎదుర్కొనే సమ...