3, మే 2023, బుధవారం

కాలం కరుణ లేనిది

కాలం కరుణ లేనిది


కాలం కరుణ లేనిది
క్షణకాలం నీ కోసం నాకోసం అగనంటుంది
తీపి జ్ఞాపకాలున్నా
చేదు నిజాలున్నా
ఏది ఏమైనా
సంతోష శుభోదయమైనా
విషాదసంధ్యా సమయమైనా
ఏ పరిస్థితెదురైనా
కాలం ఆగక ముందుకెళుతూనే ఉంటుంది

ఒక బంధాన్ని నిర్దయగా తుంచేస్తుంది
ఒక బంధాన్ని కొత్తగా చిగురింపచేస్తుంది
నువ్వు పొగిడినా పొంగిపోదు
నువ్వు తిట్టినా కుంగిపోదు
ఎన్నడూ తన పయనం మాత్రం ఆపబోదు
ఎప్పుడు తన గమనం మాత్రం ఆగిపోదు

కాలం కరుణ లేనిది
నువ్వు గెలిచావని ఆకాశాన్ని తాకినా
నువ్వు ఓడావని నేలపైన పడినా
తాను ముందుకెళుతూనే ఉంటుంది
కాలం కరుణ లేనిదని ఆడిపోసుకోకు
అన్నిటిని అర్ధం చేసుకో
ఆగిపోక ముందుకు సాగిపో
జీవితాన్ని జీవించడం నేర్చుకో  
కాల తత్వాన్ని అర్ధం చేసుకో
 

- శివ భరద్వాజ్
లైఫ్ కోచ్, వెల్త్ అడ్వైజర్ & కన్సల్టెంట్

రథ సప్తమి ప్రాముఖ్యత - ఏడు సంఖ్య రహస్యం - భీష్ముడి 7 అవయవాలు - ఆరోగ్యం & ధర్మం

🌞 రథ సప్తమి ప్రాముఖ్యత మన భారతీయ సంప్రదాయంలో పండుగలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు — అవి మన జీవన విధానాన్ని శుద్ధి చేసే మార్గదర్శకాలు. అట...