24, అక్టోబర్ 2022, సోమవారం

పడతుల చెర విడిపించ - మగువల నుద్దరించగ

 కరకు రాక్షస రూపుడైన
నరకు కన్న కొడుకైనా
మరణము నిచ్చె అమ్మైన
ధీర సత్యభామ, పడతుల చెర విడిపించ

నరకు మారు రూపులై అబలల
మానముతో నాటలాడు కొడుకుల
శిరము నుత్తరించవలె అమ్మైన
ధీర నేటి భామ, మగువల నుద్దరించగ

మిత్రులకు బంధువులకు
దీపావళి శుభాకాంక్షలు
--శివ భరద్వాజ్






*తిరస్కరణ కావాలి - ఆవిష్కరణ*

నిన్ను తిరస్కరిస్తే, నమస్కరించు,  నిరాశపడక ప్రయత్నించు,  నిరంతర సాధనతో పురోగమించు,  నిన్ను నవీకరించి, ఆవిష్కరించు,  గెలుపు పథాన తిరిగి పయనిం...