21, జనవరి 2022, శుక్రవారం

ఏధర్మం నీ ధర్మమంత గొప్పకాదురా

 ఏధర్మం నీ ధర్మమంత గొప్పకాదురా
తెలుసుకొని మసులుకో భారతీయుడా

అధర్మాన్ని ధర్మమని
స్వధర్మాన్ని కర్మమనిన్
పరమతమెల్లఁబెల్లమని
మురియక నిజము తెలుసుకొని
మసులుకో భారతీయుడా
ఏధర్మం నీ ధర్మమంత గొప్పకాదురా

పరమధర్మమహింసయని
ధరమ యుద్ధము  ఒప్పుయని
కర్మ  మార్గము చెప్పి నన్  
మర్మములును  విడమరచిన
భరతమాత ముద్దుబిడ్డడా
ఏధర్మం నీ ధర్మమంత గొప్పకాదురా

లోకమంత  సుఖించమని
లోకమంత  కుటుంబమని
సర్వ ప్రాణులు దైవమని
సర్వ మతాలు  సమమనిన్
చాటి చెప్పిన భారతీయుడా
ఏధర్మం నీ ధర్మమంత గొప్పకాదురా

మహా శివ రాత్రి : శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది?

శివుడికి అసహజమైన ఆ మూడో కన్ను ఎందుకు? దాని వెనక దాగివున్న రహస్యం, ప్రత్యేకత ఏమిటి?             తక్కిన దేవతామూర్తుల నుంచి వేరుచేసి చూపేది పరమ...