28, మే 2022, శనివారం

మానవ ధర్మ చంద్రుడిచ్చు చల్లని వెన్నెల మనకు

అజ్ఞానాంధకారంబు తిరుగు చిమ్మెట
దీపపు వెలుగు  శాశ్వతంబని అకటా!
దీపము చేరి దగ్ధంబగు
కుల మత నాయకుల గారడి మాటలు నమ్మి
వెలుగునిండు తమ జీవితంబులని తలిచి
వారి చేరి దగ్ధంబు కాకు
సత్యంబిది స్వధర్మ సూర్యుడు రక్ష మనకు
మానవ ధర్మ చంద్రుడిచ్చు చల్లని వెన్నెల మనకు
-- శివ భరద్వాజ్
భాగ్య నగరం

అకటా - అయ్యో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

బలము కలిగిన వాడే శాంతి స్థాపన చేయు - గెలిచినోడే చరిత్ర రాయు

బలము కలిగిన వాడే శాంతి స్థాపన చేయు, దుర్భలుడు తనవారి దుఃఖ పెట్టు. కనులు మూసుకున్నచో కీడు తెలియదు, అలసత్వమున్నచో ఆపదలు కలుగు. బల, ధైర్యములున్...