18, మే 2022, బుధవారం

స్పందించేందుకు సమయం లేదు

 స్పందించేందుకు సమయం లేదు
వివరించేందుకు విషయం లేదు
వినేటందుకు ఓపిక లేదు
తెలుసుకునేంత తీరిక లేదు
మన బ్రతుకేదో బ్రతికేస్తున్నాం
మన చావేదో చస్తూవున్నాం
ఎన్నాళ్లయిన కుక్కలు, నక్కలు
పందుల వలె బ్రతికేస్తున్నాం
తీరుబడి లేక జీవిస్తున్నాం
ఎంతసేపు నేను బావుండాలి
నా కుటుంబం బావుండాలనే
తపనే తప్ప నా ఊరు నా దేశం
బావుండాలనే భావన లేక బ్రతికేస్తున్నాం  
- శివ భరద్వాజ్
భాగ్య నగరం.

1 కామెంట్‌:

ఒక్క రోజు రాజు! ఓటున్న వాడురా!

|| ఆటవెలది || ఓట్లు కావలసిన, కోట్లు కావలయును, నోటు లేక రాడు, ఓటు వేయ! ఒక్క రోజు రాజు! ఓటున్న వాడురా! పిదప బిచ్చమెత్తు పిచ్చిరాజు! -శివ భరద్వ...