23, ఏప్రిల్ 2024, మంగళవారం

నిందించుటేల ఆప్తుల

నిందించుటేల ఆప్తుల

||కందము||

నిందించుటేల ఆప్తుల,
నిందించుట మాని తోడు నిలచిన, మద్ధతు
నందించి, సున్నితముగ
స్పందించిన, బంధము బలపడి నిలుచు ఉమా!

-శివ భరద్వాజ్

పెళ్ళైన పదకొండేళ్ల తర్వాత దంపతులకు ఓ అబ్బాయి పుట్టాడు. వారిద్దరికి ఒకరంటే మరొకరికి  ప్రాణం మరియు ఆ అబ్బాయి వారి కళ్ళకు రత్నం. అంతే అపురూపంగా ఆ పిల్లవాడిని చూసుకునేవారు.

ఆ అబ్బాయికి రెండు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఒక రోజు ఉదయం భర్త ఆఫీసుకు వెళుతుండగా ఒక మెడిసిన్ బాటిల్ తెరిచి ఉండటం గమనించాడు. అతని  ఆఫీసుకు ఆలస్యం అవుతుందని, తన భార్యను ఆ సీసా మూతపెట్టి అల్మారాలో ఉంచమని అడిగాడు. వంటగదిలో పనిలో నిమగ్నమై ఉన్న అతని భార్య, ఓపెన్ మెడిసిన్ బాటిల్ గురించి పూర్తిగా మర్చిపోయింది.

ఆ పిల్లవాడు బాటిల్‌ని చూసి దాని రంగుకు ముగ్ధుడై సీసా దగ్గరకు వెళ్లి మందు అంతా తాగాడు.  కానీ ఆ మందు,  చిన్న మోతాదులలో పెద్దలకు ఉద్దేశించిన విషపూరిత ఔషధం. మందు తాగిన పిల్లవాడు కుప్పకూలిపోవడంతో, ఆ తల్లి అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లింది,  కానీ ఆ పిల్లవాడు అక్కడ  మరణించాడు. ఆ తల్లి తల్లడిల్లిపోయింది.  తన భర్త వచ్చి ఏమంటాడో, అతనిని ఎలా ఎదుర్కోవాలో అని  ఆమె విపరీతంగా భయపడింది.

దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ తండ్రి ఆసుపత్రికి వచ్చి చనిపోయిన బిడ్డను చూసి, తరువాత తన భార్యను చూసి నాలుగు పదాలు మాత్రమే చెప్పాడు.

ఆ పదాలు "నేను నీతో ఉన్నాను డార్లింగ్."  తన భర్త నుండి అస్సలు ఊహించని స్పందన అది.

పిల్లవాడు చనిపోయాడు. అతన్ని ఎప్పటికీ తిరిగి బ్రతికించలేము.

తల్లి లో తప్పులు వెతికినా ప్రయోజనం లేదు. అదీగాక,  తనే ఆ బాటిల్‌ని దూరంగా ఉంచడానికి కొంత సమయం తీసుకుంటే, ఇది జరిగేది కాదు కదా అని ఆలోచించిన ఫలితంగా వచ్చిన స్పందన అది.

ఇందుకు ఎవరినీ నిందించకూడదు. ఆమె కూడా తన ఏకైక బిడ్డను కోల్పోయి తల్లడిల్లిపోతుంది. ఆ క్షణంలో ఆమెకు కావలసింది తన భర్త నుంచి ఓదార్పు, సానుభూతి.  సరిగ్గా అదే అతను ఆమెకు ఇచ్చాడు.


కొన్నిసార్లు అనుకోకుండా తప్పులు జరుగుతాయి. అప్పుడు మనం మన సమయాన్ని ఆ తప్పుకు ఎవరిని భాద్యులని చేయాలి, ఎవరిని నిందించాలి అని ఆలోచిస్తాం.  అది మన సంబంధలలో కావచ్చు, ఉద్యోగంలో లేదా మనకు తెలిసిన వ్యక్తుల విషయంలో కావచ్చు.  ఈ విధమైన ప్రవర్తన కారణంగా  మనం మానవ సంబంధాలలో గల ఆత్మీయతను కోల్పోతాము, ఒక్కోసారి పూర్తిగా ఆ బంధాలనే కోల్పోవచ్చును.  ( - మూలం వాట్సప్ ఆంగ్ల కథనం)


నిందించుటేల ఆప్తుల,
నిందించుట మాని తోడు నిలచిన, మద్ధతు
నందించి, సున్నితముగ
స్పందించిన, బంధము బలపడి నిలుచు ఉమా!

21, ఏప్రిల్ 2024, ఆదివారం

మన ఓటు మనమే వేద్దాం - మన భవిత మనమే రాద్దాం

 

నీవు లేవకుంటే,
నీవు మేలుకోకుంటే,
నీవు ఓటేయకుంటే,
👈 నీ చరితకు లేఖకుడితడు!
నీ తలరాతకు బ్రహ్మ ఇతడు!!
నీ భవిష్యత్తు ప్రధాత  ఇతడు!!!
మన భారత భాగ్య విధాత ఇతడు!!!!

మన ఓటు మనమే వేద్దాం - మన భవిత మనమే రాద్దాం
-శివ భరద్వాజ్



20, ఏప్రిల్ 2024, శనివారం

ఓటు మన హక్కు - వదులుకోమాకు

 పిల్లలు బాగుండాలని మంచి కాలేజీ చూస్తావు!
బతుకు బాగుండాలని మంచి ఉద్యోగం చేస్తావు!
అమ్మాయి బాగుండాలని మంచి సంబంధం చూస్తావు!
మనము బాగుండాలని  ఓటెందుకు వేయరావు?
మనము బాగుండాలని కోరుకునే వాడినెందుకెన్నుకోవు?
దైవ దర్శనంకై ఎన్ని గంటలైనా నిలబడతాము!
భవిత దర్శనంకై కొన్ని గంటలైనా నిలబడలేము!!

ఓటు మన హక్కు - వదులుకోమాకు
-శివ భరద్వాజ్

19, ఏప్రిల్ 2024, శుక్రవారం

ప్రజస్వామ్యానికి ఆయువు O2

 

ఓట్ల పండుగ రోజు సెలవు!
చీట్ల పేకలాట కోసం కాదు,
చీకట్ల చిందులాటకు కాదు,
బాటిళ్ల గలగలకు కాదు.
విందు వినోదాలకు కాదు.

 

 

నీ భాధ్యత నెరవేర్చటానికి,
నీ శక్తిని వినియోగించుకోటానికి,
మన భవిత నిర్మించటానికి,
మన బతుకు బాగు చేసుకోటానికి,
మనకున్న ఒకే ఒక్క అవకాశం ఓటు
ప్రజస్వామ్యానికి ఆయువు O2

ప్రతి ఒక్కరు ఓటేద్దాం - ప్రజాస్వామ్యానికి ఊపిరి పోద్దాం

-శివ భరద్వాజ్

16, ఏప్రిల్ 2024, మంగళవారం

ఒక్క రోజు రాజు! ఓటున్న వాడురా!

||ఆటవెలది||

ఓట్లు కావలసిన, కోట్లు కావలయును,
నోటు లేక రాడు, ఓటు వేయ!
ఒక్క రోజు రాజు! ఓటున్న వాడురా!
పిదప బిచ్చమెత్తు పిచ్చిరాజు!

-శివ భరద్వాజ్

*ఆలోచనతో ఓటేయుము* 

||కందము||

ఓటేయుము ఆలోచన
తోటి, కుల మత ధనబలముతో మాయచేసి,
ఓటేయ మందురు! కరిగి
ఓటేసిన! ఆరగింతురోయి జనధనం! 

-శివ భరద్వాజ్ 

6, ఏప్రిల్ 2024, శనివారం

The Upper Court

*పై కోర్టు* - *The Upper Court*


కొన్నేళ్ల క్రితం, జస్టిస్ రంగనాథ్ మిశ్రా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు, ఒడిశాలో పూరీలోగల  న్యాయ కళాశాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించబడ్డారు. అయన కాలేజీ ఫంక్షన్‌కి వెళ్లే ముందు రోజు పూరీ జగన్నాథ ఆలయానికి వెళ్లాడు.

జగన్నాథుని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా, సింహద్వారం దగ్గర ఎవరో "రంగనాథ్ బాబు" అని చాలాసార్లు పిలవడం విన్నారు. ఇంత పెద్ద స్వరంతో తనని ఎవరు పిలుస్తున్నారు! అది కూడా గుడి ద్వారం దగ్గర! అది తననేనా లేక ఇంకెవరినైనా పిలుస్తున్నారా అని ఆశ్చర్యపోతూ, సందిగ్ధంలో వెనక్కి తిరిగి చూడగా, కుష్టు రోగియైన ఒక బిచ్చగాడు కనిపించాడు. అతని శరీరం అంతా గాయాలు మరియు చేతులు, కాళ్ళకు కట్టులతో అతనిని పిలుస్తున్నాడు.

మీరు ఎవరు, నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని జస్టిస్ మిశ్రా ప్రశ్నించారు. అప్పుడు కుష్టు రోగి అతనితో, "అయ్యా, మీరు నన్ను గుర్తుపట్టలేదా?
నేను కొన్ని సంవత్సరాల క్రితం పేరుమోసిన కులియా డాకు(బందిపోటు)ని, మీరు ఒడిషా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను మీ క్లయింట్‌ని. దోపిడీ మరియు హత్య కేసులో దిగువ కోర్టు నాకు జీవితకాల కఠిన శిక్ష విధించింది. కానీ మీరు ఒడిశా హైకోర్టులో నాకు అనుకూలంగా వాదించి, నాకు ఎలాంటి శిక్ష పడకుండా విడుదల చేయించారు. కానీ సార్ నిజానికి నేను నిందితుడిని, ఆ వ్యక్తిని హత్య చేసి డబ్బు మరియు బంగారం దోచుకెళ్లాను. అదేవిధంగా ఇతర కేసుల్లో కూడా నేను ఎలాంటి శిక్ష లేకుండా విడుదలయ్యాను.

అతను కొనసాగించాడు, "సర్ నేను మానవుల కోర్టు నుండి ఎలాంటి శిక్ష లేకుండా స్వేచ్ఛను పొందాను. కానీ సార్ నిజానికి నేను నిందితుడిని, ఆ వ్యక్తిని హత్య చేసి డబ్బు, బంగారం దోచుకెళ్లాను. అదే విధంగా ఇతర కేసుల్లో కూడా నేను ఎలాంటి శిక్ష లేకుండా విడుదలయ్యాను." అయ్యా నేను మానవుల కోర్టు ద్వారా స్వేచ్ఛ పొందాను, కానీ ఆ సర్వశక్తిమంతుడి కోర్టులో నేను తీవ్రంగా శిక్షించబడ్డాను, నా శరీరం అంతా కుష్టువ్యాధి వచ్చి,అవయవాలను కోల్పోయాను. నా బంధువులు నన్ను అసహ్యించుకుని గ్రామం నుండి వెళ్లగొట్టారు. నేను రోడ్డు మీద పాకుతూ ఆహారం కోసం అందరినీ వేడుకుంటున్నాను. గుడి ద్వారం దగ్గర అప్పుడప్పుడూ ఎవరైనా భోజనం పెడతారు, లేకుంటే నేను ఆహారం తీసుకోకుండా అలాగే ఉంటాను.
అది విన్న జస్టిస్ మిశ్రా బరువెక్కిన హృదయంతో వంద రూపాయల నోటు ఇచ్చి మౌనంగా వెళ్లిపోయారు.

లా కాలేజీ ఫంక్షన్‌లో జస్టిస్ మిశ్రా కన్నీళ్లతో ఈ వాస్తవ సంఘటనను వివరించారు. మేము మా తెలివితేటలు ఉపయోగించి, ఎవరినైనా విడిపించడానికి లేదా శిక్షించడానికి వాదిస్తాము. కానీ పైన ఇంకొక ఉన్నత న్యాయస్థానం ఉంది, అందులో తెలివితేటలు పని చేయవు, మరియు దోషులు తప్పించుకోలేరు. దోషికి శిక్ష ఖచ్చితంగా  పడుతుంది.

అదే కర్మ యొక్క చట్టం(Law Of Karma).

ప్రస్తుత పరిస్థితుల్లో, మన రాష్ట్రంలో, దేశంలో, రాజకీయ నాయకులు,ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అధికారం కారణంగా చట్టం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వివిధ కారణాల వల్ల రాష్ట్రల ముఖ్యమంత్రుల మద్దతుతో, అధికార పార్టీల మద్దతుతో, తమపై ఆరోపించబడిన (తీవ్రమైన నేరారోపణలతో సహా) కేసుల నుండి అధికారం కారణంగా చట్టం నుండి, న్యాయం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

కానీ ఏ ఒక్కరు కర్మ యొక్క చట్టం(Law Of Karma) నుండి తప్పించుకోలేరు.

మూలం: https://en.rattibha.com/thread/1771469753057481202

31, మార్చి 2024, ఆదివారం

అమ్ముడు పోదామా! అడుక్కు తిందామా?

మనం కష్టపడుతున్నాం,
వారు సంపాదిస్తున్నారు.
మనం టాక్సులు కడుతున్నాం,
వారు దోచుకుంటున్నారు.
మనం చేయి చాస్తున్నాం,
మన సొమ్మునే భిక్షమేస్తున్నారు.

మనమేం చేద్దాం,ఏడుద్దామా!
మన ఓటు ఆయుధం చేద్దామా?
అమ్ముడు పోదామా! అడుక్కు తిందామా?

నీతిగా ఓటేద్దాం - అభివృద్ధిని గెలిపిద్దాం.

-శివ భరద్వాజ్

29, మార్చి 2024, శుక్రవారం

*సుభాషితం*

न राज्यं न च राजासीत् , न दण्डो न च दाण्डिकः |
धर्मेणैव प्रजास्सर्वा रक्षन्ति स्म परस्परम् ||

న రాజ్యం న చ రాజాసీత్ , న దణ్డో న చ దాణ్డికః |
ధర్మేణైవ ప్రజాస్సర్వా రక్షన్తి స్మ పరస్పరం ||

రాజ్యం లేదు, రాజు లేడు, శిక్ష లేదు, శిక్షించే వారు లేరు |
ధర్మం ద్వారానే ప్రజలందరూ ఒకరినొకరు రక్షించుకున్నారు ||
 

न राज्यं न च राजासीत् , न दण्डो न च दाण्डिकः ।
स्वयमेव प्रजाः सर्वा , रक्षन्ति स्म परस्परम् ॥ 

న రాజ్యం న చ రాజాసీత్ , న దణ్డో న చ దాణ్డికః ।
స్వయమేవ ప్రజాః సర్వా , రక్షన్తి స్మ పరస్పరమ్ ॥

రాజ్యం లేదు, రాజు లేడు, శిక్ష లేదు, శిక్షించే వారు లేరు. |
ప్రజలందరూ స్వయంగా ఒకరినొకరు రక్షించుకున్నారు. ||



न राज्यं न राजाऽसीन्न दण्डयो न च दाण्डिक: |
धर्मेणैव प्रजास्सर्वा रक्षन्ति स्म परस्परम् ||

న రాజ్యం న రాజాసీత్ , న దణ్డయో న చ దాణ్డికః |
ధర్మేణైవ ప్రజాస్సర్వా  రక్షన్తి స్మ పరస్పరం ||

రాజ్యం లేదు, రాజు లేడు, శిక్ష లేదు, శిక్షించే వారు లేరు |
ధర్మం ద్వారానే ప్రజలందరూ ఒకరినొకరు రక్షించుకున్నారు ||



25, మార్చి 2024, సోమవారం

బలము కలిగిన వాడే శాంతి స్థాపన చేయు - గెలిచినోడే చరిత్ర రాయు

బలము కలిగిన వాడే శాంతి స్థాపన చేయు,
దుర్భలుడు తనవారి దుఃఖ పెట్టు.
కనులు మూసుకున్నచో కీడు తెలియదు,
అలసత్వమున్నచో ఆపదలు కలుగు.
బల, ధైర్యములున్నచో కీడు విరుగు.

జాతి మనుగడకు ఐక్యత మూలము.
సంఘ మనుగడకు సంఖ్య బలము.
సంఖ్య పెరిగిన బలము పెరుగు,
బలము కలిగిన శాంతి కలుగు.
 
ధైర్యముగా నిలబడిన దాడులాగు.
ఐక్యత లేని జాతి కనుమరుగునగు.
ధైర్యము లేని జాతి దేబిరించు.
నీవెటులుందువో నిర్ణయించు.

నీ జాతి వెలుగు, నీ నిర్ణయమే అని మరువకు.
గెలిచినోడే, చరిత్ర మార్చునన్న నిజాన్ని మరువకు.
-శివ భరద్వాజ్

నిందించుటేల ఆప్తుల

నిందించుటేల ఆప్తుల ||కందము|| నిందించుటేల ఆప్తుల, నిందించుట మాని తోడు నిలచిన, మద్ధతు నందించి, సున్నితముగ స్పందించిన, బంధము బలపడి నిలుచు ఉమా! ...